60 ఏండ్ల వృద్దుడు 10 ఏండ్ల బాలికను రేప్ చేసిన ఘటనలో..
24 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు.
నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య(60 సంవత్సరాలు) 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ అమ్మాయి బడికి పోయి వొచ్చి నిద్రపోతున్న సమయంలో ఒక్కతే ఉన్నదని చూసి 28.03.2023 రోజున అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న అమ్మాయిని లేపి తిను బండారాలు ఇచ్చి మానభంగం చేసినాడు.ఎవరికైనా చెప్పితే చంపుతానని బెదిరించినాడు.ఈ ఘటనపై బాధితురాలి తల్లి 29 మార్చి 2023 న నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి SHO కంచర్ల బాస్కర్ రెడ్డి SC NO:51/2023 గా నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిభ్రవరి 28.03.2023 న కేసు సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. U/s 448,342,376(2)(i) IPC Sec 5(m) r/w 6 of POCSO ACT 2012 రెండేండ్ల విచారణ అనంతరం POCSO Incharge న్యాయస్థానం ఇన్చార్జి న్యాయమూర్తి రోజా రమణి మంగళవారం సెప్టెంబర్ 16 తుది తీర్పు వెల్లడించడం జరిగింది. ఈ కేసు లో నిందితునికి 24 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ ,40,000 జరిమానా తీర్పు ఇవ్వడం జరిగింది. బాధితురాలికి రూ.10,00,000 కంపెన్సేషన్ ప్రకటించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఐ.వోలుగా కంచర్ల బాస్కర్ రెడ్డి,వి.నర్సింహారెడ్డి,భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన, కోర్టు కానిస్టేబుల్ దుర్గ రాజు(4167) సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడంలో ప్రధాన భూమిక పోషించారు.





