– ఈ విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది
– ప్రజలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సందేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్టు తట్టుకుని నిలబడగలగడం తనకు, నీటిపారుదల శాఖ సహచరులకు గొప్ప ఉపశమనం కలిగించిందని పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని మీతో (ప్రజలతో) పంచుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు. 1,82,000 క్యూసెక్కుల వరదను తట్టుకుని సురక్షితంగా నిలబడిరది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ వరద(ఎంఎఫ్‌డీ) 70 వేల క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువ అని తెలిపారు. నిన్నటి ఉద్రిక్త క్షణాల తర్వాత ప్రాజెక్టు బలంగా నిలబడటం, చూడటం నిజంగా ఇది గర్వించదగ్గ, భావోద్వేగ సమయం అని అన్నారు.
పోచారం ప్రాజెక్ట్ వివరాలు
వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ తొలి ప్రాజెక్టు పోచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం కామారెడ్డి జిల్లాగా ఉన్న మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో ఈ ప్రాజెక్టుకు 1917లో నిజాం శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ.27.11 లక్షల వ్యయంతో 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది. గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తున్నది. నిజాం ప్రభుత్వం సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కి.మీ. మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట, దాని చుట్టూ 58 కి.మీ పొడవైన కాల్వలు తవ్వారు. ఈ ప్రాజెక్టుకు 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద 10,500 ఎకరాలు సాగు జరుగుతోంది. గతంలో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది. 1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన ఏ జోన్, 49 నుంచి 73 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన బీ జోన్లుగా ప్రాజెక్టును విభజించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే