- దాఖలు చేసిన జయ వింధ్యాల
అమరావతి, ప్రజాతంత్ర, డిసెంబర్ 17:మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది. హిడ్మాతోపాటు ఇతరుల ఎన్‌కౌంటర్ పై పీపుల్స్ యూనిటి ఫర్ సివిల్ లిబర్టీస్ హ్యూమన్ రైల్స్ ఫోరం అధ్యక్షురాలు జయ వింధ్యాల ఏపీ హై కోర్టులో పీల్ దాఖలు చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సిట్టింగ్ జడ్జీతో లేదా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జయ వింధ్యాల దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్బంగా ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాళపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచారు. మెజిస్టీరియల్ విచారణపై పిటిషనర్ల కు అభ్యంతరం ఉంటే సెషన్స్ జడ్జ్ లేదా మెజిస్ట్రేట్‌ని ఆశ్రయించాలని పేర్కొన్నారు. నేరుగా హై కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేయడం కంటే, కింది కోర్టులో ఫిర్యాదు చేసి విచారణ కోరడం సరైన పక్రియ అని అయన అభిప్రాయపడ్డారు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత చట్టబద్దంగా జరగాల్సిన మెజిస్టీరియల్ విచారణ ఇప్పటికే మొదలైందని, దర్యాప్తు సంస్థలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే.. అడ్వకేట్ జనరల్ దమ్మాళపాటి శ్రీనివాస్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హై కోర్టు ధర్మాసనం, ఈ విషయంలో మరింత లోతుగా అద్యయనం చేయాలని పిటీషనర్ తరుపు న్యాయవాదిని ఆదేశించడం గమనార్హం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





