మ‌హిళా విద్య‌కు ఆది గురువులు ఫూలే దంప‌తులు

– నిర్మాత పొన్నం రవిచంద్ర

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8: సుపదా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఫూలే అనువాద చిత్రం
భారత సంస్కరణ ఉద్యమాల చరిత్రకు మైలు రాయి వంటిదని నిర్మాత, సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్ర అన్నారు. హైదరాబాదులోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫూలే దంపతులు మహిళలందరికీ విద్య నేర్పిన ఆది గురువులని పేర్కొన్నారు. 200 సంవత్సరాల క్రితం సావిత్రిబాయి ఫూలే, జ్యోతిబాఫూలే దంపతులు దళితులు, స్త్రీలు, బహుజనుల పట్ల అప్పటి సమాజ అమానవీయతకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఆ సామాజిక ఉద్యమాన్ని తెలుగు నేలపై స్ఫూర్తి నింపేందుకే హిందీలో వచ్చిన ఈ సినిమాను తెలుగులో నిర్మించామని తెలిపారు. ఈ సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తుందని, మహిళా భ్యున్నతికి, ఆనాడు ఉన్న కుల వివక్షకు వ్యతిరేకంగా సర్వ సమానత్వ భావన కోసం జరిపిన త్యాగాలను ఈ తరానికి గుర్తు చేస్తుందని అన్నారు. సినిమా మాట‌ల ర‌చ‌యిత కత్తి చేతన్ మాట్లాడుతూ ఇది వ్యాపారత్మక సినిమా కాదని, సామాజిక సంఘర్షణల కళాత్మక చిత్రమనంటూ దీనిని రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యావంతులంతా చారిత్రక దృష్టితో చూడాలని కోరారు. ఈ సినిమా తెలుగులో ఒక సంచలమైన సందర్భం అవుతుందన్నారు.

సీఎం, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేల‌కు కృతజ్ఞతలు

ఫూలే ప్రివ్యూ షో చూసి సినిమా టీంని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మంత్రివర్గ సభ్యులు, శాసనమండలి, శాసనస‌భ సభ్యులు, దిల్ రాజు లకు రవిచంద్ర, కత్తి చేతన్, సి.వి.నవీన్ కుమార్, రాజీవ్ చంద్ర పొన్నంలుహృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సినిమాకు వినోదపు పన్ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సినిమా సెన్సార్ బోర్డ్ పరిశీలన తర్వాత జనవరి చివరి వారంలో అన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తామన్నారు. సమావేశంలో తిరుపతి గౌని, ఉదయ్ కుంభం, జనని, నేతికార్ సురేష్ లాల్, అభినవ్ వరాల, నీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *