ప్రజా సంక్షేమమే పోలీసుల లక్ష్యం

 – ఏసీపీ శ్రీనివాస్‌ నాయుడు, రూరల్‌ సీఐ శంకర్‌ గౌడ్‌

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారని, సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తున్నారని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్‌ నాయుడు, రూరల్‌ సీిఐ శంకర్‌ గౌడ్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట ప్రింట్‌ మీడియా యూనియన్‌ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా ఏసీపీ శ్రీనివాస్‌ నాయుడు, రూరల్‌ సీఐ శంకర్‌ గౌడ్‌లు మాట్లాడుతూ సమాజంలో శాంతిభద్రతల విషయంలో పోలీసులది కీలకపాత్ర అంటూ వారికి అన్ని వర్గాల వారూ సహకరించాలన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ అనేకమంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని, వారి త్యాగాలు మరువలేనివని అన్నారు. యాదగిరిగుట్ట ప్రింట్‌ మీడియా యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు కళ్లెం సంపత్‌, అధ్యక్షుడు బూడిద శ్రీహరి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టి పోలీసులు పనిచేస్తున్నారంటూ వారి సేవలను కొనియాడారు. అనేకమంది పోలీసులు తమ జీవితాలను ప్రజల కోసం త్యాగం చేశారన్నారు. పోలీసులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని, అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. ప్రతి సంవత్సరం వారిని స్మరించుకోవడంతోపాటు, వారి ఆశయ సాధనకు అంకితమై ప్రతి ఒక్కరం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల స్థూపం చిత్రపటానికి జర్నలిస్టులు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎస్సై యాదయ్య, పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రింట్‌ మీడియా యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు సిహెచ్‌.శేఖర్‌, ఆకుల గిరిబాబు, ఉపాధ్యక్షులు పుట్ట హనుమంత్‌, సోలాపూర్‌ వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి ఇండ్ల మచ్చేందర్‌, సెక్రటరీ జనరల్‌ ఏలూరి విక్రమ్‌, కోశాధికారులు ఆరుట్ల కిషోర్‌ కుమార్‌, డంగు నరేందర్‌, ప్రచార కార్యదర్శి మొగిలిపాక కనకరాజు, సంయుక్త కార్యదర్శులు కొల్ల సందీప్‌రెడ్డి, బి.అమర్నాథ్‌, కార్యవర్గ సభ్యులు క్రాంతి, సుక్కల సంజీవ, శిఖ సాయికిషోర్‌, కర్రే గణేష్‌, మీస వెంకటేష్‌, ఓరుగంటి శివకుమార్‌, బూడిద బలరాం తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *