పెన్షన్ భిక్ష కాదు.. ఉద్యోగి హక్కు

– పెన్షనర్స్ కు చిరస్మరణీయుడు న‌కారా
– పెన్ష‌న‌ర్స్ అసోసియేషన్ జిల్లా అధ్య‌క్షుడు న‌ర‌సింహారెడ్డి

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17ః ఉద్యోగులకు పెన్షన్ సాధించిన మహానుభావుడు ధర్మ స్వరూప్ నకారాకు జాతీయ పెన్షనర్స్  దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ హనుమకొండ జిల్లా శాఖ కార్యాలయంలో నివాళుల‌ర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఈ. నరసింహారెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లకు అతి పెద్ద పండుగ డిసెంబర్ 17 నేషనల్ పెన్షనర్స్ డే అని, పెన్షనర్స్ చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచిన సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ అంటే భిక్ష కాదు.. పెన్షన్ అంటే ఉద్యోగి హక్కు, ప్రభుత్వాలు ఇచ్చే దయాధర్మం కాదు అని చీఫ్ జస్టిస్ వై.వి.చంద్రచూడ్, ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 17 డిసెంబర్ 1982లో తీర్పు ఇచ్చింద‌ని చెప్పారు. ఉద్యోగులకు పెన్షన్ సాధించిన 17 డిసెంబర్ ను జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా* 1983 నుండి జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. దేశంలో పెన్షన్ కోసం పోరాడి సాధించిన నకారాకు, అధ్భుతమైన తీర్పునిచ్చి పెన్షనర్స్ అందరి మదిలో చిరస్ధాయిగా నిలిచిన వై.వి.చంద్రచూడ్ కు సమావేశం జోహార్లర్పించింది. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ సకాలంలో పెన్షన్ పొందుతూ ప్రశాంత జీవనం గడపడం వెనుక నకార కృషి, సాగించిన పోరాటం చిరస్మరణీయమ‌ని అన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి.వీరాస్వామి మాట్లాడుతూ ఉద్యోగి పదవీవిరమణ అనంతరం వృద్దాప్య జీవితం సుఖసంతోషాలతో, గౌరవంతో జీవించేందుకు చెల్లించేదిగా పెన్షన్ అని, నకారా కృషి ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్షలాది పెన్షనర్ల జీవితాలకు ముసురుకున్న చీకట్లు తొలగిపోయాయ న్నారు  సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సమ్మారెడ్డి, అసోసియేట్స్ అధ్యక్షుడు ఎల్.ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఏం. సింగారెడ్డి, చీఫ్ అడ్వైజర్ రత్నాకర్, జ్యోతి రమణి, ఆగయ్య, కందుకూరి దేవదాసు, తిరుపతి రెడ్డి, రాధ, ప్రసాద్ తదితరులు మాట్లాడారు సమావేశంలో జి. సత్యనారాయణ, ఎల్.ప్రభాకర్ రెడ్డి, వి.రాజిరెడ్డి కె.రమేష్, రాజకొమురమ్మ, సుధాకర్ రెడ్డి, కిష్టయ్య, కుమారస్వామి, చందర్రావు, కృష్ణమూర్తి, శ్యామ్ రావు తదితరులు 150 మంది పెన్షనర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *