ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా కాంగ్రెస్ పార్టీ

– ఎన్నిక‌ల వాగ్దానాల‌ను అమ‌లు చేస్తాం
– పాదయాత్ర‌లు కాంగ్రెస్‌కు అల‌వాటే
– రానున్న కాలంలో మ‌రిన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు
– మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర‌లో మంత్రులు

పరిగి, ప్రజాతంత్ర, జూలై 31: ప్రజలకు ప్రభు త్వానికి వారధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంద ని ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం పరిగి పట్టణంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జనత పాదయాత్ర మరియు శ్రమదాన కార్యక్ర మాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్చార్జి మీనాక్షి నటరాజ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ హాజరయ్యారు. పరిగి మండల పరిధిలోని రంగాపూర్ గ్రామం నుండి పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని, పాదయాత్రలు అనేవి కాంగ్రెస్ పార్టీకి అలవాటే అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, ప్రతి ప్రభుత్వంలో లొసుగులు ఉంటాయని, అలాంటి వాటిని సరి చేసుకోవడానికి ఈ పాదయాత్రలు అని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని, అయినా వాటిని అధిగమించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కులగనలతో మోడల్ గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం, రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తుందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, నేడు ఆ ప్రాజెక్టు పునరుద్ధరణకై ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో జిల్లాకు సాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో భాజాపా ప్రభుత్వం ముఖం చాటేస్తుందని అన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకోసం 5,6,7 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలన్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని, ప్రజలకు అండగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే నిలబడుతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూముల అమ్మకం చేపట్టారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీపై నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీకి అధికారం అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని, రానున్న రోజుల్లో 35 వేల ఉద్యోగాలు ఇచ్చి లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ పాదయాత్రను చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా కాంగ్రెస్ పార్టీ ఉండాలని, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి,నారాయణ రెడ్డి కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *