సర్పంచ్‌ల పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించాలి

– మెదక్‌ ఎం‌పి రఘునందన్‌ ‌డిమాండ్‌

‌సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి1: పెండింగ్‌లో ఉన్న సర్పంచుల బిల్లులను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ మెదక్‌ ఎం‌పీ రఘునందన్‌ ‌రావు  డిమాండ్‌ ‌చేశారు. కొత్త సర్పంచులకు నిధులను కేటాయించాలని విన్నవించారు. గురువారం అక్బర్‌పేట, భూంపల్లి మండలంలోని బొప్పాపూర్‌లో ఎంపీ రఘునందన్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓపెన్‌ ‌జిమ్‌, ‌బాలవికాస వాటర్‌ ‌ప్లాంట్‌, ‌సోలార్‌ ‌స్ట్రీట్‌ ‌లైట్లను సర్పంచ్‌ ‌మాధవనేని భాను ప్రసాద్‌, ‌పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ రఘునందన్‌ ‌రావు డియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ కళలు కన్నా గ్రామస్వరాజ్యం సాధించాలని పాలకవర్గానికి సూచించారు. తన పార్లమెంట్‌ ‌పరిధిలో ఎప్పుడు, ఏ సమస్య వొచ్చిన 24 గంటలు తాను అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. వ్యక్తిగత రీత్యా కూడా గ్రామపంచాయతీల ఏర్పాటుకు కృషి చేస్తానని మాటిచ్చారు. బొప్పాపూర్‌ ‌గ్రామ పంచాయతీ, ఐకేపీ సెంటర్లో లైట్లు, రోడ్ల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హా ఇచ్చారు. ప్రతి ఇంటిపై సోలార్‌ను ఏర్పాటు చేసుకుని కరెంట్‌ ఆదా చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు ఎంపీ రఘునందన్‌ ‌రావు.మూడున్నరేళ్లలో సోలార్‌ ‌నుంచి కరెంట్‌ ‌తయారీ చేసేలా చూడాలని నిర్దేశిరచారు. ఎనగుర్తి నుంచి శిలాజీ నగర్‌ ‌వరకు డబుల్‌ ‌రోడ్డు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వద్ద ‘మన ఊరు – మన బడి’ నిధుల్లేవని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ‌హయాంలో సర్పంచులు పనిచేసిన బిల్లులను కూడా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసే ప్రతి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్‌ ‌రావు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *