ధాన్యం కొనుగోలులో ఇబ్బందులుండొద్దు

– అత్యవసరమైతే అదనపు ఖర్చులకు వెనుకాడొద్దు
– గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి
– కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌

హౖాెదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్‌ టైం రికార్డు సాధించిందని, కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  సూచించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సచివాలయం నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుడూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న రవాణా వసతిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన అంశంలో అత్యవసరం అనుకుంటే అదనపు ఖర్చులకు వెనకాడవద్దని, ధాన్యం కొనుగోలు వివరాలను సత్వరమే నమోదు చేయాలని, నమోదైన కొనుగోళ్లకు 48 గంటలలో చెల్లింపులు జరపాలని, కొనుగోళ్ల విషయంలో మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మద్దతు ధరతోపాటు బోనస్‌ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం.. రైతులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు చర్యలు తీసుకోవాలి.. గత యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికారుల సమన్వయంతో సత్ఫలితలు సాధించాం.. అని తెలిపారు. అధిక దిగుబడి దృష్ట్యా ఈ వానాకాలం కొనుగోళ్లలోనూ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సత్వరం తనను, పౌరసరఫరాల కమిషనర్‌ను సంప్రదించాలని సూచించారు. తాము 24 గంటలు అందుబాటులో ఉంటామని, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్వవేక్షించాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచనలు ఇచ్చారు. కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర‌మోహ‌న్‌, పౌర సరఫరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *