అవినీతి ర‌హిత పాల‌న అందిస్తున్న మోదీ

– రాష్ట్రాలకు 42శాతం నిధులు
– ప‌ద‌కొండేళ్ల‌లో ఉగ్ర‌దాడులు లేకుండా కాపాడారు
– తెలంగాణ‌లో 40 రైల్వేస్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ‌
– 70ఏళ్లు దాటిన‌వారికి ఆయుష్మాన్ భార‌త్‌
– కాంగ్రెస్ హ‌యాంలో 42వేల‌మంది ఉగ్ర‌దాడుల్లో మృతి
-ప‌దాధికారుల స‌మావేశంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

ప్రపంచం మొత్తం నరేంద్ర మోదీ పాలనపై విశ్వాసం, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న‌దని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. 11ఏళ్ల పాలనలో ఒక్కరూపాయి అవినీతి లేకుండా కొనసాగించారన్నారు. యూపీఐ హయామంతా కుంభకోణాల మయమే అని ఆరోపించారు.

జీరో టాలరెన్స్ విధానంతో నీతివంతమైన పాలనను ప్రధాని మోదీ దేశానికి అందించారన్నారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు. మోదీ పదకొండేళ్ల పాలనపై వివరాలను గ్రామాలలోని ప్రతీ ఇంటికి అందించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *