ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తుల వెల్లువ‌

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 4 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 238 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 51, రెవెన్యూ శాఖకు సంబంధించి 46, మున్సిపల్ శాఖకు 23, ఇందిరమ్మ ఇండ్ల కోసం 67, ప్రవాసి ప్రజావాణికి 02 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 49 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను  పరిష్కరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *