హిల్ట్ ‌పాలసీపై విపక్షం అవాస్తవాలు ప్రచారం

– బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఇచ్చిన జీవోనే అమ‌లు చేస్తున్నాం
– కాలుష్య నియంత్రణకే పరిశ్రమల తరలింపు: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డి సెంబర్‌1 : హిల్ట్ ‌పాలసీపై విపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి దుద్దిళ్ల‌ శ్రీధర్‌బాబు విమర్శించారు. సోమవారం ఆయన మీడియా మాట్లాడుతూ లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను కన్వర్షన్‌ ‌చేసే అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు. పట్టాలు ఉండి, సొంత భూములు ఉన్నవారికే కన్వర్షన్‌ ‌ఫీజు పెట్టామని తెలిపారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) హయాంలో ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను పారిశ్రామికవేత్తలకు ఇచ్చే జీవో తీసుకొచ్చారన్నారు. ఖాయిలా పడిన పరిశ్రమల భూములను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నమే హిల్ట్ ‌పాలసీ అని, ప్రభుత్వ భూమిపై హక్కును బదిలీ చేస్తున్నామనేది అబద్ధమ‌ని స్ప‌ష్టం చేశారు. హిల్ట్ ‌పాలసీలో ఎస్‌ఆర్‌వో రేటు కంటే ఎక్కువ ఫీజు నిర్ణయించామ‌ని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందులో రైతులకు సంబంధించిన భూములు లేవన్నారు. ఇక బీఆర్‌ఎస్‌ ‌తెచ్చిన జీవోనే తాము ముందుకు తీసుకుని వెళుతున్నామన్నారు. నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలన్న ఉద్దేశంతోనే బాలానగర్‌, ఆజామాబాద్‌ ఇం‌డస్ట్రియల్‌ ఏరియాల్లో ఉన్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ ఆవలకు తరలిస్తున్నామని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *