నర్సు నిమిషకు భారీ ఊరట.. ఉరిశిక్ష వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో పెద్ద ఊరట లభించింది. యెమెన్‌ ప్రభుత్వం చివరి క్షణంలో ఆమెకు విధించిన ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. ఆ దేశ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించడంతో రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడిరది. కేరళకు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్‌ పూర్తి చేసి 2008లో యెమెన్‌కు వెళ్లింది. అక్కడ కొన్నేళ్ళపాటు పలు హాస్పిటల్స్‌లో నర్సుగా పనిచేసింది. ఈ నేపథ్యంలోనే 2014లో ఆమెకు స్థానికంగా ఉండే తలాల్‌ అబ్దో మహది అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిరది. ఆ దేశ చట్టాల ప్రకారం నిమిషా తన క్లినిక్‌ బిజినెస్‌లో తలాల్‌ అబ్దోను భాగస్వామిగా చేర్చుకుంది. అయితే క్లినిక్‌ ప్రారంభించిన కొంతకాలానికే వారిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడికి జైలు శిక్ష పడిరది. అయితే, అతడు జైలు నుండి విడుదలై వచ్చాక ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె పాస్‌ పోర్టు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. వేధింపులు తట్టుకోలేకపోయిన నిమిషా పాస్‌ పోర్టు తిరిగి తీసుకోవడానికి అతడిని చంపాలని ప్లాన్‌ వేసింది. 2017లో అతడికి ఇంజెక్షన్‌ ఇచ్చి చంపేసింది. అయితే, పాస్‌పోర్టు తీసుకుని ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆమెను యెమెన్‌ పోలీసులు అరెస్టు చేశారు. 2017నుంచి ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. 2023లో యెమెన్‌ సుప్రీం జుడీషియల్‌ కౌన్సిల్‌ ఆమెకు మరణ శిక్ష విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *