జూబ్లీహిల్స్‌కు ఇప్పుడే ఉపఎన్నిక ఉండకపోవచ్చు

సీఈఓ సుదర్శన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 17: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్‌ ఉండకపోవచ్చని, రెండు, మూడు రాష్ట్రాల్లో ఖాలీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికే షన్‌ ఇప్పటికే వొచ్చిందని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థా నం ఖాలీ అయినట్లు అసెంబ్లీ తమకు గెజిట్‌ పంపించిందని గుర్తుచేశారు. ఆ గెజిట్‌ తాము యధాతథంగా కేంద్ర ఎన్నిక ల సంఘానికి పంపించామని అన్నారు. జూబ్లీహిల్స్‌లో డిసెంబర్‌ వరకు కొత్త ఎమ్మెల్యే ఎన్నిక జరగాలని సీఈవో సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చాలా సంస్కరణలను తీసుకువ స్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. బూత్‌ లెవెల్‌ ఏజెంట్స్‌, ఈఆర్‌ఓలతో ఇంటరాక్ట్‌ కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. వీరికి ట్రైనింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తోం దని వివరించారు. పోలింగ్‌ స్టేషన్‌లలో మినిమం వోటర్ల సంఖ్యను 1200కు కుదించిందని గుర్తుచేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఆంక్షలను 200 టర్ల నుంచి కిలో మీటర్‌ వరకు పెంచిందని వెల్లడిరచారు సీఈఓ సుదర్శన్‌ రెడ్డి. పోలింగ్‌ కేంద్రానికి కిలోటర్‌ వరకు పార్టీలు ప్రచారం చేయడానికి వీలు లేదని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి అన్నారు. పోలింగ్‌ సెంటర్స్‌ వద్ద ఇక నుంచి మొబైల్‌ ఫోన్స్‌ కోసం డిపాజిట్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. నేషనల్‌ లెవెల్‌ లీగల్‌ కాన్ఫరెన్స్‌ కోసం ముగ్గురు న్యాయవాదులకు శిక్షణ ఇస్తోందని అన్నారు. రూరల్‌లో 87శాతం, అర్బన్‌లో 67శాతం ఓటర్‌, ఆధార్‌ కార్డ్‌ లింక్‌ జరిగిందని సీఈఓ సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *