ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 15: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు సిట్‌ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. 17వ తేదీన జూబ్లీహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి రావాలని ఆ నోటీసులో సూచించారు. మరోవైపు ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌ రావును మంగళవారం సిట్‌ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 8.30 గంటలపాటు ఆయనకు పలు ప్రశ్నలు సంధించి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *