హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : నార్త్ ఈస్ట్ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 21, 22 తేదీల్లో ఐమాక్స్‌లో థియేటర్‌లోని స్క్రీన్-4, స్క్రీన్-5 లలో పలు భాషల సినిమాలను ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 సినిమాలతోపాటు 4 తెలుగు సినిమాలు ప్రదర్శించనున్నారు. ఆయా సినిమాల దర్శకులు, ఇతర ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారని తెలిపారు. సినిమాలు ప్రదర్శించనున్న ఐమాక్స్ థియేటర్‌ను స్పెషల్ కమిషనర్ మంగళవారం పరిశీలించారు. సినిమాల ప్రదర్శనకు, ఆహ్వానితులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు, థియేటర్ నిర్వాహకులకు సూచించారు. నార్త్ ఈస్ట్ కనెక్ట్ – ఎ టెక్నో కల్చరల్ ఫెస్టివల్-2025లో భాగంగా వివిధ వేదికలపై ఐటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్‌తోపాటు సినిమాలు ప్రదర్శించనున్నట్లు, టీజీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో సినిమాలు ప్రదర్శిస్తున్నట్లు ఆమె తెలిపారు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ ఎల్.ఎల్.ఆర్.కిషోర్ బాబు, సీఐఈ రాధాకిషన్, ఉప సంచాలకులు యాసా వెంకటేశ్వర్లు, ఐమాక్స్ థియేటర్ జనరల్ మేనేజర్ వెంకటప్రసాద్, క్యూబ్ ప్రతినిధి రఘురామ్, యూఎఫ్‌వో ప్రతినిధి సంజయ్, మాచిరాజు సాయి ప్రసాద్ తదితరులు థియేటర్‌ను పరిశీలించారు.
ప్రదర్శించే వివిధ సినిమాలు, ఏ భాషలో రూపొందించారు, నిడివి వివరాలు :
1) Yawing (Tripuri) 1.35 hrs
2) Tara- The lost star Sikkim(Nepali) 1:30 Hrs
3) Kooki (Hindi) 1:55 Hrs
4) Onaatah: Of the Earth: Meghalaya (Khasi) 1:48 Hrs
5) Anur(Assami)2:42 Hrs
6) Boomba Ride (Assami) 1:16 Hrs.
7) Eikhogi Yum (Manipuri):1.29 Hrs.
8) Rador, Pakhi (Assami) 2.09 Hrs.
9) Balagam (Telugu) 2:11 Hrs
10) Naa Bangaru Thalli (Telugu )R2:29 Hrs
11) Pottel (Telugu) 2:00 Hrs.
12) Mallesham (Telugu):2:11 Hrs.
సాంస్కృతిక వైవిధ్యాన్ని అవగాహన చేసుకునేందుకు ఈ సినిమా ప్రదర్శనలను తిలకించాలని నగర ప్రజలకు స్పెషల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




