సమ్మిట్‌ విజయవంతంపై సీఎంకు నోరి అభినందనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్‌ నిపుణులడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు అభినందనలు తెలియజేశారు. ఈమేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఈ సమ్మిట్‌ చరిత్రాత్మక విజయం సాధించిందని, రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలన, స్థిరత్వం, భవిష్యత్తు పైన ఉన్న విశ్వాసానికి నిదర్శనం అని పేర్కొన్నారు. డీప్‌ టెక్‌, గ్రీన్‌ ఎనర్జీ, లైప్‌ సైన్సెస్‌ వంటి రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 శక్తికి నిదర్శనమని అన్నారు. ప్రపంచవేదిక పైన తెలంగాణ పోటీ పడటానికి తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు కోసం చేస్తున్న ప్రయత్నాలు హర్షణీయమని దత్తాత్రేయుడు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *