జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు

– 150కిపైగా నామినేషన్లు
– 100 మార్కును దాటిన అభ్యర్థుల సంఖ్య

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజున పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 150కిపైగా నామినేషన్లు దాఖలవగా అభ్యర్థుల సంఖ్య 100 మార్క్‌ను దాటింది. మూడు గంటల తర్వాత గేటు లోపల ఉన్న వారికి మాత్రమే నామినేషన్లు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ వికాస నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి ఎన్నికల అధికారులకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్‌ తరఫున నవీన్‌ యాదవ్‌ నామినేషన్లు వేశారు. బుధవారం నుంచి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి సాయిరాం పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు గడువు ఉన్నది. నవంబర్‌ 11న ఎన్నిక జరుగనుండగా 14న వోట్లను లెక్కించి ఫలితాలను అదేరోజు ప్రకటించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *