ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం

స్టాక్‌హోమ్, అక్టోబర్ 13 : ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించారు. జోయ‌ల్ మోకిర్‌, ఫిలిప్ అఘియాన్‌, పీట‌ర్ హోవిట్‌ల‌ను ఈ అవార్డు వ‌రించిన‌ట్లు సోమవారం స్టాక్‌హోమ్‌లో నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది. ఆవిష్క‌ర‌ణ‌ల‌తో జ‌రిగే ఆర్థిక ప్ర‌గ‌తిని ఈ శాస్త్ర‌వేత్త‌లు వివ‌రించిన‌ట్లు నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. నోబెల్ పుర‌స్కారంలో సగం బ‌హుమ‌తి మోకిర్ వెళ్ల‌నున్న‌ది. మిగితా స‌గం ఫిలిప్‌, హోవిట్‌ల‌కు ద‌క్కుతుంద‌ని క‌మిటీ తెలిపింది. సాంకేతిక ప్ర‌గ‌తి ద్వారా సాధించే సుస్థిర అభివృద్ధికి కావాల్సిన అంశాల‌ను ఆర్థిక శాస్త్ర‌వేత్త మోకిర్ గుర్తించిన‌ట్లు నోబెల్ క‌మిటీ చెప్పింది. ఇక క్రియేటివ్ డిస్ట్ర‌క్ష‌న్ ద్వారా జ‌రిగే సుస్థిర ప్ర‌గ‌తి సిద్దాంతాన్ని ఇద్ద‌రు శాస్త్ర‌వేత్త‌లు అందించిన‌ట్లు క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *