విజయోత్సవాలకు అనుమతి లేదు

-ఎన్నికల కోడ్‌ ఇం‌కా అమలులో  ఉంది
– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ ‌హన్మంతరావు

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి ప్రతినిధులు ఎవరూ వియోత్సవ ర్యాలీలు జరుపుకోవద్దని జిల్లా కలెక్టర్‌ ‌హన్మంతరావు ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పోలింగ్‌ ‌నిర్వహించామ‌ని తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు వొచ్చే వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. విజేతలు విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు జరుపుకోవద్దు. నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. యాదాద్రి జిల్లాలు మూడో విడతలో 92.56 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. మొత్తం1,59,289 మంది వోటర్లు ఉండగా, 1,47,432 వోట్లు పోలయ్యాయి. 92.79 శాతంగా ఉన్న 73,640 మంది పురుషులు, 92.33 శాతంగా ఉన్న 73,792 మంది మహిళలు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు నిర్వహించిన ఆరు మండలాల్లోనూ 90 శాతానికి పైగా రికార్డు స్థాయిలో వోటింగ్‌ ‌శాతం నమోదైంది. అత్యధికంగా చౌటుప్పల్‌ ‌మండలంలో 94.25 శాతం మంది వోటేశారు. ఆ తర్వాత గుండాలలో 92.83, సంస్థాన్‌ ‌నారాయణపురంలో 92.44 శాతం, మోటకొండూరులో 92.28, అడ్డగూడూరులో 91.29 శాతం, మోత్కూరులో 90.11 శాతం మంది వోటేశారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత కౌంటింగ్‌ ‌ప్రారంభించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో 114 సర్పంచ్‌ ‌పదవులు, 993 వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 9 గంటల వరకు 26.62 శాతం మాత్రమే పోలింగ్‌ ‌నమోదైంది. ఆ తర్వాత పోలింగ్‌ ‌శాతం పుంజుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 85.94 శాతం,అనంతరం 92.56 శాతం నమోదైంది. వోట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగింది. 2019 పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతతో పోలిస్తే ఈసారి స్వల్పంగా పోలింగ్‌ ‌శాతం తగ్గింది. పోయినసారి 94.06శాతం వోట్లు పోలయ్యాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *