– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: బీఆర్‌ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉందని పసలేని, తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగితే తప్పేంటి అని ప్రశ్నించారు. గతంలో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కూడా అడిగారని గుర్తుచేశారు. పసలేని వాళ్లు తమ మీద ఆరోపణలు చేస్తే జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ విమర్శలు మాని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని హితవు పలికారు. వ్యక్తిగత అవసరాల కోసం జీహెచ్‌ఎంసీలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేశారని, దీనిపై మొదటి నుంచి బీజేపీ అభ్యంతరం చెబుతోందని అన్నారు. గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లను డబ్బు ఆశ, ఇతర అంశాలను సాకుగా చూపి కాంగ్రెస్‌లోకి రావాలని కోరుతున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏం ఉండదన్నారు. గ్రామంలోని ప్రతి అభివృద్ధికి కేంద్ర నిధులే ప్రధానమని స్పష్టం చేశారు. బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద అవగాహన ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.