బనకచర్లపై రాజీపడబోము

– ఆల్మట్టి ఎత్తుపెంచడాన్ని అంగీకరించం
– ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్‌
– మంత్రి ఉత్తవమ్‌కుమార్‌

కోదాడ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: బీఆర్‌ఎస్‌ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని, నమ్మశక్యం కాని మాటలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్రలకు తెర లేపారని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బనకచర్ల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, నిర్మాణాన్ని అడ్డుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల నిర్మాణాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నదని, కేంద్ర జలశక్తి మంత్రికి స్వయంగా, లేఖల ద్వారా రాష్ట్ర అభ్యంతరాలను తెలిపామని చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంచడాన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పభుత్వాలు ఉన్నా నదీ జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాలలో తెలంగాణ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. కృష్ణా జలాలలో 70 శాతం వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందన్నారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌తోపాటు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్‌కు మంత్రి హోదాలో స్వయంగా తానే హాజరు అయ్యానని, మంత్రి హోదాలో ట్రిబ్యునల్‌కు హాజరైన మొదటి మంత్రిని తానేనని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నీటిపారుదల రంగంపై కోట్లు ఖర్చు పెట్టినా సాధించింది ఏమీ లేదన్నారు. కాళేశ్వరంతో సాగులోకి వచ్చింది నామమాత్రపు ఆయకట్టేనని, పాలమూరు-రంగారెడ్డి, సీతారామలతో ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పెండిరగ్‌ పడిన ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేస్తామని చెప్పారు. డిరడి ప్రాజెక్టుకు బీఆర్‌ఎస్‌ పాలకులు నీటి కేటాయింపులు చెయ్యలేకపోయారని విమర్శించారు. డిరడి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, సూర్యపేట జిల్లాకు దేవాదుల నీరు పారించాతన్నదే ప్రభుత్వ సంకల్పమని ఉత్తమ్‌ చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లపాటు రాని ధాన్యం దిగుబడి ఈ రెండేళ్లలో రికార్డుస్థాయిలో వచ్చిందని, కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల తోటే ఇంతటి దిగుబడి సాధ్యమైందని వెల్లడిరచారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *