నిజామాబాద్, ప్రజాతంత్ర : నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆదివారం సారంగాపూర్ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.అయితే హాస్పిటల్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలోపోలీసులు రియాజ్‌పై కాల్పులు జరిపగా. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రియాజ్‌ను వెంటనే జీజీహెచ్ హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. అక్కడ రియాజ్‌ను పరీక్షించిన వైద్యులు చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు.





