పహల్గాం ఉగ్రదాడి ప్రధాని సూత్రధారిపై ఛార్జిషీట్

న్యూఢిల్లీ, డిసెంబ‌ర్ 15: పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోమవా రంనాడు జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. దాడి ప్రధాన ఎస్ఈ సూత్రధారిగా పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద కార్య కలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా కమాండర్ జాజిద్ జాట్ ను పేర్కొంది. హహల్గాం దాడి కేసులో లష్కరే తొయిబా, దాని ఫ్రంట్ ఆర్గనైజైషన్ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్స్  సహా ఏడుగురు నిందితులపై ఎన్ఐఏ ఛార్జిషీటు నమోదు చేసింది. హహల్గాం దాడిలో పాకిస్థాన్ కుట్ర, నిందితుల పాత్ర, వాటిని బలపరచే సాక్ష్యాలను ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. నిషేధిత ఎల్ టీ/టీఆర్ఎఫ్ సంస్థ ఈ కుట్రకు ప్రణాళిక రచించి దాన్ని అమలు చేసినట్టు తెలిపింది. మతం పేరు అడిగిమరీ పాక్ స్పాన్సర్డ్ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారని, ఒక పౌరుడు సహా 25 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్నారని పేర్కొంది. ఈ మేరకు 1,597 పేజీల ఛార్జిషీటును ప్రత్యేక కోర్టుకు ఎన్ఐఏ సమర్పించింది. ఉగ్రదాడి అనంతరం జూలైలో చేపట్టిన ఆపరేషన్ మహదేవ్లో భారత బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు పాక్ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. ఈ ఉగ్రవాదులను ఫైసల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్లా అఫ్గానిగా పేర్కొంది. ఈ ముగ్గురితోపాటు సాజిద్ జాట్, ఎల్ఈటీ/టీఆర్ఎఫ్ల‌పై భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్) 2023. ఆయుధాల చట్టం-1959, చట్టవిరుద్ధ కార్యాక లాపాల నిరోధక చట్టం-1967లోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలను మోపింది. ఉగ్ర వాదులకు ఆశ్రయం కల్పించారనే కారణంగా జూన్ 22న అరెస్టు చేసిన మరో ఇద్దరు నిందితులు పర్వెజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ల పేర్లను కూడా ఛార్జిషీటులో ఎన్ఐఏ చేర్చింది. ఇంటరాగేషన్ లో ఈ ఇద్దరూ దాడిలో ప్రమేయమున్న మరో ముగ్గురు సాయుధ ఉగ్రవాదుల వివరాలను వెల్లడించారు. ఈ ముగ్గురూ ఎల్ఈటీ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసిన పాక్ ఉగ్రవాదులని అంగీకరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *