కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: విద్యుత్ శాఖలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పా టుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్కు సంబంధించిన మార్గ దర్శకా లను బుధవారం విడుదల చేసింది. వ్యవసాయానికి, పేదల గృహాలకు 200 యూనిట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల నిర్వహణ, అలాగే ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని సంస్కరించడం ఈ డిస్కం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఉన్న తెలంగాణ సదరన్, నార్తర్న్ డిస్కమ్లతో పాటు ఈ కొత్త డిస్కం పనిచేయనుంది. దీనివల్ల విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆర్థిక స్థిరత్వం, సంక్షేమ పథకాల అమలును మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త డిస్కమ్ ఏర్పాటుపై గతంలోనే కేబినేట్లో నిర్ణయించారు. దీనిద్వారా విద్యుత్ వినియోగాన్ని లెక్క కట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *