మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం
పరిష్కారం చూపని పరిశీలనలు ఎందుకో
పేదోడి దవాఖానపై పట్టింపు ఏది ?
కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన పెద్ద ఆసుపత్రికే నిర్లక్ష్యం అనే అతి పెద్ద జబ్బు చేసింది. పేరుకే జిల్లా ఆసుపత్రి కానీ అన్నీ అవస్తలే దర్శనమిస్తాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికిలో అడుగు పెట్టాలి అంటేనే ముక్కుపుటాలు అధిరిపోయే మురుగు కంపుతో డ్రైనేజీ నీరు స్వాగంత పలుకుతోంది జిల్లా ప్రజలకు. ఆసుపత్రికి చెందిన డ్రైనేజీ నిండి మురుగు నీరు ఆవరణలోకి ప్రవహిస్తుంది. గడచిన మూడు నెలలుగా మురుగు నీరు అంతా ఆసుపత్రి పరిసరాలలో ఎక్కడికక్కడే నిలిచి ప్రాంగణం అంతా దుర్గంధం వెదజల్లుతోంది. ప్రజలు ఊపిరి బిగపట్టి ముక్కు మూసుకుంటేగానీ హాస్పిట్‌లోకి అడుగు పెట్టలేని దుర్భర దుస్థితి నెలకొంది. హాస్పిటల్‌కు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనం. దీనితో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారు జిల్లా వాసులు.
ఇంత నిర్లక్ష్యమా ?
వైద్యో నారాయణో హర్ణి అంటారు పెద్దలు. అలాంటి వైద్యులు ఉండాల్సిన ప్రదేశం ఇంకెంతాలా శుభ్రంగా ఉండాలి. కానీ అందుకు విరుద్దంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి తయారైంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోడంతో మురుగు నీరు హాస్పిట్ ప్రాంగణంలోకి ప్రవహిస్తుంది. ప్రత్యాన్మయ ఏర్పాట్లు లేకపోడంతో పారిశుధ్యం లోపించి డ్రైనేజీ వాటర్ అంతా ఎక్కడికక్కడే నిలుస్తుంది. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంతో వివిధ జబ్బులతో హాస్పిటల్‌లో చేరిన రోగుల మల మూత్రాలతో కూడిన డ్రైనేజీ నీటితో హాస్పిటల్ అంతా గలీజ్ కంపు కొడుతుంది. దీనికి తోడుగా బయో వేస్టేజ్ వాటర్ సైతం ఇదే నీటిలో కలుస్తున్నాయి. మూడు నెలలుగా ఈ సమస్యలపై అధికారులు దృష్టి సారించకపోడంతో కలుషిత నీరు అంతా ప్రభుత్వ ఆసుపత్రి బయట రోడ్డు మీదికి సైతం చేరుతోంది. వైరాలజీ ల్యాబ్ సమీపంలో పరిస్థితి గురించి ఎంత తక్కు చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లు తయారైతంది. నిలువ ఉన్న మురుగు నీటిలో క్రిమి కీటకాలు దర్శనమిస్తునం ఇస్తున్నాయి. ఓపి ప్రాంగణం వద్ద భారీగా నిలువ ఉన్న డ్రైనేజీ నీరు దోమలకు ఆవాసంగా మారింది. అసలే విష జ్వరాలు విజృంభిస్తున్న వేళ ఆసుపత్రికి వచ్చే ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్న అంశము. ఎమర్జెన్సీ వార్డు సమీపంలోను ఇదే దుస్థితి.
ఔషదాలన్నీ ఔట్‌సైడే అంటున్న వైద్యులు
ఇంత బాధలు పడి జిల్లా నలుమూలల నుండి హాస్పిటల్‌కు వస్తున్నరు పేద ప్రజలు. అయితే తీరా ఆసుపత్రిలోకి వైద్యం కోసం వస్తే మందులు లేవని కావాలి అనుకుంటే బయట కొనుక్కోమని వైద్య సిబ్బంది సూచిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రాధమికంగా ఇచ్చే అత్యవసర ఔషదాల కొరత ఉన్నట్లు రోగులు వాపోతున్నారు. అసలు మందులు లేవా లేక కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నార అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
పొంచివున్న ప్రమాదం
ఆసుపత్రి ప్రధాన ద్వారాల వద్ద మురుగు నీరు ప్రవహిస్తూ రోడ్డు మీదకు ప్రవహిస్తుంది. ఆసుపత్రి ఎదుటు నిలుస్తున్న డ్రైనేజీ వ్యర్థపు నీటిలో బాక్టీరియా, వైర్‌స్ ప్రమాదకర రీతిలో చేరుతున్నాయి. ఎవరైనా సరే ఈ మార్గాలగుండా ఆసుపత్రికిలోకి రావాల్సిన పరీస్థితి. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులతోటు, కుటుంబ సభ్యులకు సైతం ఇన్ఫెక్టన్స్ సోకే ప్రమాదం పొంచి ఉంది. ఔట్ పేషెంట్‌కు వచ్చే రోగులు కూడా భయపడుతున్నారు. ఈ ఇన్పెక్షన్స్ కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు అని ప్రజలు భయాందోళ వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను గంభీరంగా తీసుకోకపోవడంతో చేసేది ఏమి లేకడాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది అదే దుర్భర పరిస్థితుల నడుమ విధులు నిర్వర్థిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా అటు ఆసుపత్రి వర్గాలు, ఇటు పారిశుధ్య అధికారులు పట్టించు కోపోవడం పట్ల జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం కారణంగా రోగులతోపాటు ఆ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మురుగు నీరు దుర్గంధంతో వీధి మొత్తం కుళ్ళు కంపు కొడుతుందంటూ ఆరోపిస్తున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో మురుగు నీరు పాదాచారుల మీద చిల్లి అందులోని బ్యాక్టీరియా, వైరస్‌లతో ఇన్ఫెక్షన్స్‌కు గురవుతున్నాము అంటూ భయాందోళ చెందుతున్నారు. ఇంటి నుండి బయట అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. బయో వేస్టేజ్ వాటర్ వలన దీర్గకాలిక వ్యాధులు సంక్రమించే ప్రమాదతో పాటు పర్యావరణం సైతం కలుషితం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారలు చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుమార్లు ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు వెళ్ళినా కేవంలం ఆసుపత్రిని పర్యటిస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదంటూ స్థానికులు మండి పడుతున్నారు. పేద ప్రజల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యం దేకికంటూ ప్రశ్నిస్తున్నారు. తక్షణమే యుద్ద ప్రాతిపాధికన పనులు చేపట్టి శాశ్వత సరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు ప్రత్యాన్మయం ఏర్పాటుచేసి ముగురు నీరు నివుల ఉండకుండా కాలువల్లోకి మళ్ళించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.





