ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
ధిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు తమ స్కోర్‌ను ఆన్‌లైన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈమెయిల్‌తో పాటు, ఫలితాలను చీుA అధికారిక వెబ్ సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు.
ఫలితాలను ఎలా చెక్ చేయాలి
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించండి. NEET UG 2025 స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ అనే లింక్‌పై క్లిక్ చేయండి. మీ నీట్ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. ‘సబ్‌మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి. మీ స్కోర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోండి.
త్వరలో కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) త్వరలోనే 15% ఆల్ ఇండియా కోటా సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేయనున్నారు. మిగిలిన 85 శాతం రాష్ట్ర కోటా సీట్లకు ఆయా రాష్ట్రాలు కౌన్సెలింగ్ నిర్వహించనున్నాయి. నీట్ యూజీ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమతమ రాష్ట్రాలకు సంబంధించి కౌన్సెలింగ్ తేదీలపౖౖె ఫోకస్ చేయాల్సి ఉంది.
నీట్ యూజీలో టాపర్ ఎవరంటే..
రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.9999547 శాతంతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ తరువాత ఉత్కర్ష్ అవధియ (99.9999095), క్రిషంగ్ జోషి (99.9998189), మృణాల్ కిషోర్ జా (99.9998189), అవిక అగర్వాల్ (99.9996832), జెనిల్ వినోద్‌బాయ్ భయాని(99.9996832), కేశవ్ మిట్టల్(99.9996832), భవ్యా చిరాగ్ (99.9996379), హర్ష్ కేదావత్ (99.9995474), ఆరవ్ అగర్వాల్ (99.9995474) టాప్ టెన్ ర్యాంకులు సాధించారు.





