ఎన్డీయే కూటమికి 133-159 , మహాఘట్ బంధన్ కూటమికి 75-101 , ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే బీహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. – ఎన్డీయే కూటమి దాదాపు 8.3 శాతం వోట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ మీద పైచేయి సాధించినట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయ్యింది. – 243 స్థానాలు ఉన్న బీహార్ శాసనసభలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డీయే కూటమికి 133-159 స్థానాలు, మహాఘట్ బంధన్ కూటమికి 75-101 స్థానాలు, ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, నూతనంగా ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీకి 0-5 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించింది. నితీష్ కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్గార్ యోజన పథకం కింద కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ భారీ మెజారిటీ సాధించడానికి దోహదపడింది. – ఎన్డీయే కూటమికి 46.2 శాతం వోట్లు, మహాఘట్ బంధన్ కు 37.9 శాతం, నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం ఎన్డీయే కూటమిలోని బీజేపీ 63-70, జేడీయూ 55-62, ఎల్జేపీ (ఆర్వీ) 12-17, హామ్ 2-5, ఆర్ఎల్ఎం 1-4 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. – మహాగట్ బంధన్ లోని ఆర్జేడీ 62-69, కాంగ్రెస్ 9-18, సీపీఐ(ఎంఎల్) 4-9 గెలిచే అవకాశాలున్నాయి- పీపుల్స్ పల్స్ – నూతనంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 0-5 స్థానాలు, ఏఐఎంఐఎం పార్టీ 0-2, సీపీఐఎంకి 0-3, వీఐపీకి 0-5, సీపీఐ 0-2, ఇతరులు 2-8 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. – బీజేపీకి 21.4 శాతం, ఆర్జేడీకి 23.3 శాతం, జేడీయూకి 17.6 శాతం, జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.7 శాతం, ఎల్జేపీకి 5 శాతం, ఇతరులకు 7.2 శాతం వోట్లు వచ్చే అవకాశం ఉంది అని సర్వే వెల్లడించింది
బీహార్ లో మళ్ళీ ఎన్డీఏ కే అవకాశం :పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే





