భారత్ దృక్కోణంలో నాయకుల ప్రకటన
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో భారత్ జీ20 అధ్యక్షత సమయంలో సాధించిన కీలక ఫలితాలను భారత్ ప్రతిధ్వనించగలిగింది: నాయకుల ప్రకటనతో పాటు గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలు, ప్రాధాన్యాలు దీనిలో ప్రతిబింబించేలా భారత్ చూసుకుంది. భారత్ దృక్కోణంలో కీలక ఫలితాలు కింద ఉన్నాయి. ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలు అన్నింటినీ నేతలు ఖండించారు. [పేరా 6] ..సాంకేతికత విషయంలో… డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల పరివర్తన సామర్థ్యాన్ని హైలైట్ చేశారు. అంతేకాకుండా ఏఐ సహా డిజిటల్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సురక్షితమైన, భద్రత గల, నమ్మకమైన కృత్రిమ మేధస్సు అభివృద్ధి, విస్తరణ, ఉపయోగాన్నీ పునరుద్ఘాటించారు. [పేరా 45] . మహిళలు, బాలికల సాధికారత గురించి తరచూ బలంగా ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో భారత్ జీ20 అధ్యక్షతన సాధించిన ముఖ్య ఫలితాల్లో ఒకటి… మహిళల నేతృత్వంలోని అభివృద్ధి ప్రోత్సహించడం. [పేరా 101] .

దక్షిణాఫ్రికా అధ్యక్షతన విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడం, వేగంగా ప్రతిస్పందించడానికి కీలక ప్రాధాన్యమిచ్చారు. భారత్ అధ్యక్షతన ప్రారంభించిన… విపత్తు ప్రమాదాన్ని తగ్గించే కార్యాచరణ బృందం సాధించిన ఫలితాలను ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా, విపత్తును ఎదుర్కునే మౌలికసదుపాయాల (సీడీఐఆర్) కోసం కూటమి ఏర్పాటునూ ప్రముఖంగా ప్రస్తావించారు. [పేరా 9] . ఆహార భద్రత సందర్భంలో… ఆహార భద్రత, పోషకాహార విషయంలో దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలను పునరుద్ఘాటించారు. [పేరా 39] . ఆరోగ్యం విషయంలో సాంప్రదాయిక, కాంప్లిమెంటరీ వైద్యం పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు… ఇది భారత నేతల ప్రకటనను ప్రతిధ్వనించింది. [పేరా 104] . అ త్యంత ముఖ్యమైన విజయాల్లో ఒకటి… వాతావరణ రంగం కోసం ఆర్థిక సహాయం. ఈ విషయంలో మేం గత సంవత్సరం కంటే మరింత ప్రతిష్ఠాత్మకంగా మా వాణిని వినిపించాం. వాతావరణ రంగానికి ఆర్థిక సహాయాన్ని బిలియన్ల నుండి ట్రిలియన్ల డాలర్లకు పెంచాల్సిన అవసరాన్ని గుర్తించడంతో పాటు… అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ జాతీయ స్థాయిలో నిర్ణయించిన సహకారాలను అమలు చేయడానికి 2030 ముందు కాలానికి 5.8–5.9 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం అంచనాను ఈ ప్రకటన హైలైట్ చేసింది. [పేరా 94 మరియు 95] స్థిరమైన ఉత్పత్తి, వినియోగ విధానాలను స్వీకరించడం… సుస్థిరమైన అభివృద్ధి కోసం జీవనశైలిని (ఎల్ఐఎఫ్ఈ) ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన ప్రాముఖ్యాన్ని గుర్తించారు. [పేరా 26] . ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించాలనీ… తద్వారా దాని ప్రాతినిధ్యాన్ని మెరుగుపరుచుకోవాలని భారత్ పిలుపునిచ్చింది. [పేరా 83] . అదనంగా, భారత నేతల ప్రకటనలోని భాష… వివిధ ఇతర విషయాలపై పత్రం అంతటా ప్రతిధ్వనించింది.





