నారెడ్కో ప్రాపర్టీ షోలో ఆకట్టుకున్న పర్యాటక స్టాల్‌

-షోలో కేంద్రబిందువుగా నిలిచింది.
– ఛాయా చిత్రాలను తిలకించిన మంత్రులు భట్టి, జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన టూరిజం స్టాల్‌ సందర్శకులను కట్టిపడేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు ఈ స్టాల్‌ను ఆవిష్కరించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయం, పులుల అభయారణ్యాలు, సోమశిల, లక్నవరం, నాగర్జున సాగర్‌ బుద్ధవనం, భువనగిరి కోట, పాండవుల గుట్ట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను నరెడ్కో ప్రాపర్టీ షో వేదికగా ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక సంపద, సహజ సౌందర్యాన్ని సమన్వయంగా ప్రదర్శించిన ఈ స్టాల్‌ ప్రాపర్టీ షోలో ఆకర్షణీయ కేంద్రంగా నిలిచింది. భట్టి విక్రమార్క, కృష్ణారావు స్టాల్‌లోని ఛాయాచిత్రాలను తిలకించారు. పర్యాటకాన్ని ఆర్థికవృద్ధి కీలక శక్తిగా మార్చాలనే ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబించింది. ఈ స్టాల్‌ సందర్శకుల దృష్టిని ఆకర్షించి, తెలంగాణ టూరిజం ఔన్నత్యాన్ని చాటిచెప్పింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *