పుట్టగొడుగుల పెంపకంపై 13న శిక్షణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ప్రస్తుతం రాష్ట్రంలో పుట్టగొడుగుల పెంపకం అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించడానికి ఒక మంచి ఉపాయం. ఇది నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక ముఖ్యంగా మిద్దె తోటదారులు అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమైనది. పుట్టగొడుగులలో ప్రొటీన్లు, ఫైబర్‌, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారుల నుండి మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్‌ ఉంటుంది. తెలంగాణ వాతావరణ పరిస్థితులకనుగుణంగా కొన్ని రకాల పుట్టగొడుగులను సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పుట్టగొడుగుల పెంపకంపై ఈనెల 13న ఒక్క రోజు మాత్రమే తెలంగాణ హార్టికల్చర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రెడ్‌హిల్స్‌, నాంపల్లి నందు శిక్షణ నిర్వహింనున్నారు. పుట్టగొడుగుల పెంపకంపై మరింత సమాచారం, శిక్షణ వివరాల కోసం ఉద్యానవన శాఖ అధికారులు బి.మంగ, హెచ్‌వో 8977714411, షాజుద్దీన్‌ 8688848714లను సంప్రదించవచ్చు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *