జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్13: జీవితాంతం తోడుంటామని చెప్పిన వారే క్షణికావేశాలతో, వివాహేతర సంబంధాలు, ఇతరత్రా కారణాలతో అకారణంగా భార్యా/భర్తల ప్రాణాలను తీస్తున్నారు. నూరేళ్ల జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో భార్యను హతమార్చి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్య (42)ను ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రామాచారి ఒక వీడియోను రికార్డు చేశాడు. తన భార్య, కూతురు వేధింపులు తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు అందులో పేర్కొన్నాడు. వీడియోను తన ఫోన్‌లో స్టేటస్‌గా ఉంచినట్లు సమాచారం. రామాచారికి ఇది రెండో వివాహం. మొదటి భార్య మరణించడంతో సంధ్యను వివాహం చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





