పర్వతారోహణలో జయకేతనం ఎగరేసిన కేయూ విద్యార్థిని 

కాళోజి జంక్షన్/ హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబరు 1:  కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన నేషనల్ సర్వీస్ స్కీమ్ వలంటీర్ జయశీల రూపాని హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వద్ద ఉన్న “అటల్ బిహారి వాజపేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అల్లైడ్ స్పోర్ట్స్  నిర్వహించిన పది రోజుల “అడ్వెంచర్ క్యాంపు” లో విజయవంతంగా పాల్గొన్నారు. ఈ శిక్షణా శిబిరంలో ఆమె నేచురల్ రాక్ క్లైంబింగ్, ఆర్టిఫిషియల్ మౌంటెన్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, మౌంటెన్ క్లైంబింగ్, మౌంటెన్ రేపెల్లింగ్, రివర్ క్రాసింగ్ తదితర సాహస క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. ఈ విజయంపై విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం జయశీల రూపానిని అభినందించారు.
————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *