పాలమూరు జిల్లాలో విషాద ఘటన

– కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య

మహబూబ్‌ ‌నగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి12: మహబూబ్‌నగర్‌ ‌జిల్లా భూత్పూర్‌లోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తీవ్ర మనస్థాపానికి చెందిన జంగమ్మ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం జంగమ్మ(42) తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి దగ్గరలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది.మొదట ఇద్దరు కూతుళ్లు జ్యోతి(15), శైలజ(13) బావిలో తోసింది. ఆ తర్వాత జంగమ్మ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె కుమారుడు భయంతో అక్కడ నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాలను బావి నుంచి మృతదేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *