వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళి పరిశీలన

– రాష్ట్ర ఎన్నికల అధికారి కుముదిని, సీఎస్‌, డీజీపీలు 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17 : రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సరళిని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని, రాష్ట్ర ప్రభుత్వ పధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌ రెడ్డిలు ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారాపరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వెబ్‌ కాస్టింగ్‌ టెక్నాలజీని మరింత విరివిగా ఉపయోగించి ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో టెక్నాలజీ వాడటం వల్ల గ్రామాలలో శాంతిభద్రత సమస్య తగ్గుతుందని, దీని వల్ల ప్రజలలో ఎన్నికలపై నమ్మకం కలిగి పోలింగ్‌ శాతం పెరిగే అవకాశముంటుందని పేర్కొన్నారు. మొదటి, రెండో దశల పోలింగ్‌తో పోలిస్తే మూడవ దశలో పోలింగ్‌ శాతం పెరిగే అవకాముందని ఆయన తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్లను, అధికారులను, పోలింగ్‌సిబ్బందిని సిఎస్‌ అభినందించారు. కాగా గ్రామ పంచాయతీరాజ్‌ ఎన్నికలకు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీజీపీి శివధర్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి శ్రీధర్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సృజన, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మందా మకరందం తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *