అన్‌లైన్‌ ‌గేమ్స్ ‌బారిన ప‌డి మరో యువకుడు బలి

– డబ్బులు పోగొట్టుకోవడంతో ఆత్మహత్య

మేడ్చల్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 27 : జిల్లాలోని సూరారం పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ ‌గేమ్స్‌కు అలవాటుపడ్డ రవీందర్‌ (24) అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌ ‌గేమ్స్‌కు బానిసైన రవీందర్‌ అం‌దులో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారంటూ వీడియో రికార్డ్ ‌చేశాడు. ఆపై రవీంద్‌ ‌తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రవీందర్‌ ‌మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. గత కొద్దిరోజులుగా రవీందర్‌ ఆన్‌లైన్‌ ‌గేమ్స్ ఆడుతూ ఆర్థికంగా నష్టపోయాడు. నష్టాలు పూరించేందుకు స్నేహితులు, తెలిసిన వారి వద్ద నుంచి భారీగా నగదును అప్పుగా తీసుకుని మరోసారి ఆన్‌లైన్‌ ‌గేమింగ్‌ ‌యాప్‌లో పెట్టుబడులు పెట్టాడు. అయితే ఎంత పెట్టుబడి పెట్టినా అతడికి లాభాలు రాకపోగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలోనే సూసైడ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రవీందర్‌ ఓ ‌సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆన్‌లైన్‌ ‌గేమ్స్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయానని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నానని, తనలా ఇంకెవరూ మోసపోవద్దంటూ స్నేహితులను కోరాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ వీడియో రికార్డ్ ‌చేసిన అనంతరం గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీందర్‌ ఆర్థిక సమస్యలతో ఎక్కడెక్కడ అప్పులు చేశాడు, ఎంత మేరకు నష్టపోయాడు, సూసైడ్‌కు పూర్తి కారణాలు ఏంటి అనేదానిపై సూరారం పోలీసులు ఆరా తీస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *