ఎల్‌బి స్టేడియంలో శాసనసభ్యుల క్రీడోత్సవాలు

– ఏర్పాట్లు  పరిశీలించిన స్పోర్ట్సు అథారిటీ చైర్మన్‌ ‌శివసేన రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 27: ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కాబోతున్న శాసనసభ్యుల క్రీడోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలంగాణ స్పోర్ట్సు అథారిటీ చైర్మన్‌ ‌శివసేన రెడ్డి అన్నారు. 28 నుంచి ఎల్‌బి స్టేడియంలో ప్రారంభం కానున్న ఫస్ట్ ఎడిషన్‌ ‌లెజిస్టేటివ్‌ ‌స్పోర్ట్సు- 2026 ఏర్పాట్లను ఆయన స్పోర్ట్సు అథారిటీ ఎండి డాక్టర్‌ ‌సోనీ బాలాదేవితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల్లో క్రీడల పట్ల అవగాహన తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న శాసనసభ్యుల క్రీడోత్సవ పోటీలను ఘనంగా నిర్వహించబోతున్నామని, తద్వారా రాష్ట్రంలో క్రీడల పట్ల అవగాహన, ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించబోతున్నామని తెలిపారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్న ఈ క్రీడా పోటీలలో పార్టీల భేదభావాలు లేకుండా అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు భాగస్వామ్యం కావడం సంతోషకరమని అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో టగ్‌ ఆఫ్‌ ‌వార్‌, ‌ఫుట్ బాల్‌, ‌క్రికెట్‌, అథ్లెటిక్స్, ‌కబడ్డీ, వాలీబాల్‌ ‌బాడ్మింటన్‌,‌ టేబుల్‌ ‌టెన్నిస్‌తోపాటు కొన్ని రిక్రియేషనల్‌ ‌క్రీడా పోటీలు నిర్వహించబోతున్నట్ల తెలిపారు. ఈ పోటీలు వీక్షించడానికి అందరికీ ఉచిత ప్రవేశం కల్పించబోతున్నామని, అందరికీ అవసరమైన సౌకర్యాలను సమకూర్చామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్సు అథారిటీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *