– అన్ని ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిస్తా
– మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 10: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్‌ను బయటపెడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలతో వివరణ ఇస్తానన్నారు. కూకట్‌పల్లిలో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే తాను చెప్పానన్నారు. ఎమ్మెల్యే మాటలకు ఫీలయ్యేది లేదని. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఐదు రోజులపాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తామని తెలిపారు. నేడు కంటోన్మెంట్‌లోని బోయినపల్లి గవర్నమెంట్ స్కూల్‌ను సందర్శించినట్లు చెప్పారు. ‘మన ఊరు- మన బడి’లో భాగంగా ఈ స్కూల్‌ను బాగు చేశారని, కానీ కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు లేవన్నారు. వాటిని తాము ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ స్కూల్‌లోనే అంగన్వాడీని కూడా కలిపారని, కానీ అందులో హెల్పర్లు లేరన్నారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టామని వెల్లడించారు. స్కూల్స్, హాస్పిటల్స్‌లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామన్నారు. ఇండ్లు, ఇళ్ల పట్టాలను లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నామన్నారు. తాము చేయగలిగేది ఒక సంస్థగా చేస్తామని స్పష్టం చేశారు. టాప్ టెన్ విద్యార్థులకు జాగృతి తరఫున స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించారు. ప్రజల సమస్యలను వీలైనంతగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తనను నిజామాబాద్‌కే పరిమితం చేశారని, అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతోందో చూడలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది.. ఏం జరగలేదన్నది ‘జనం బాట’ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తాము చేయగలిగేవి చేస్తామని, మిగిలిన సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం పట్టించుకోవటం లేదని, పాలక పక్షం అసలే పట్టించుకుంట లేదని, అందుకే జాగృతి జనం గళమై పనిచేస్తోందని కవిత పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.