మోసాలు నిలదీస్తున్నందుకే అక్కసు

యూ ట్యూబ్‌ ‌ఛానెళ్లపై రేవంత్‌ అసహనం ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శ
జడ్చర్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మోసాలను నిలదీస్తున్నందుకే యూట్యూబ్‌ ‌చానెళ్లపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. రేవంత్‌ ‌రెడ్డి యూట్యూబ్‌ ‌చానెళ్లను తక్కువ చేసి మాట్లాడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం జడ్చర్లలో హరీష్‌ ‌రావు వి•డియాతో మాట్లాడుతూ…సిఎం య్యూట్యూబ్‌ ‌ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరమని, వారిని నమ్ముకుని అధికారంలోకి వొచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నడని, వారి అక్రమాలను, మాట తప్పిన తీరును, మోసాలను నిలదీస్తుంటే..యూట్యూబ్‌ ‌చానెళ్లను తక్కువ చేసి మాట్లాడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.

 

రేవంత్‌ ‌రెడ్డి అవసరానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నారని హరీష్‌ ‌రావు ధ్వజమెత్తారు. ఓడ దాటెదాక ఓడ మల్లన్న..ఓడ దాటినంక బోడి మల్లన్న అన్న చందంగా రేవంత్‌ ‌తీరు ఉందని విమర్శించారరు. యూట్యూబ్‌లను నమ్ముకునే గతంలో తమ ప్రభుత్వం వి•ద ఆరోపణలు చేశావు కదా…అంటూ హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. గత ప్రభుత్వం వి•ద అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వొచ్చాడని, అవే యూట్యూబ్‌ ‌చానెళ్లు ఆయన భండారాన్ని, అక్రమాలను, అవినీతిని, డొల్ల తనాన్ని, మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాలను బయటపెడతుంటే ఇవాళ నీవు తట్టుకోలేకపోతున్నాడంటూ మండిపడ్డారు.

అవి తట్టుకోలేక అక్కసుతో యూట్యూబ్‌ ‌చానెళ్లను విమర్శిస్తున్నాడని అన్నారు. సిఎం గురించి ప్రజలకు అర్థమైపోయిందని, ఆయనను గద్దె దించడానికి ఈ రాష్ట్రంలోని యూట్యూబ్‌ ‌ఛానళ్ళు ఒక్కటైతయని, ఆయన భండారాన్ని బయట పెడుతయి జాగ్రత్త అని హరీష్‌ ‌రావు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *