మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి..

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 31 : మిస్ వరల్డ్ 2025 విజేతగా మిస్ థాయిలాండ్ నిలిచారు. ఒపల్ సుచత ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్నారు. జడ్జి జూలియా మొర్లి విజేత పేరు ప్రకటించారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా.. మిస్ వరల్డ్ 2025 విన్నర్ థాయిలాండ్ యువతికి కిరీటంతో సత్కరించారు. మిస్ వరల్డ్ పోటీల్లో రన్నర్‌గా ఇథియోపియాకు చెందిన హాసెట్‌ డెరెజె నిలిచారు.  మిస్ వరల్డ్ థర్డ్ ప్లేస్ – పోలాండ్,  నాలుగో స్థానంల మిస్‌ మార్టినిక్ నిలిచారు.

మిస్‌ వరల్డ్ 2025గా ఎంపికైన థాయ్‌లాండ్‌ భామ ఓపల్ సుచాత ప్రొఫైల్ చాలా భిన్నమైంది. పూర్తి పేరు ఓపల్ సుచాతా చుయాంగ్స్రీ. ఆమె  థాయ్‌లాండ్, పుకెట్ లో  2003, సెప్టెంబ‌ర్ 20 న జ‌న్మించారు.  ప్రాథమిక, ప్రీ- యూనివర్శిటీ విద్యను ఫుకెట్‌లోని కజొంకియేసుక్సా స్కూల్‌లో, బాంకాక్‌లోని ట్రైమ్‌ ఉదోం సుక్సా స్కూల్‌లో పూర్తి చేశారు. ప్రస్తుతం థామ్మసాట్‌ యూనివర్శిటీలో రాజకీయ శాస్త్రం అండ్ అంతర్జాతీయ సంబంధాలపై డిగ్రీ చదువుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *