– కాంగ్రెస్‌లో బీజేపీ మాజీ కార్పొరేటర్ కిలారి చేరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: వివిధ మైనారిటీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫహీం ఖురేషి, వివిధ మైనారిటీ సంఘాల నేతలు పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆహ్వానించారు. కార్యక్రమంలో బిక్కసాని నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



