– కెటిఆర్ విమర్శలకు మంత్రి వివేక్ సవాల్
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30: రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ అంటున్నారని.. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో కేటీఆర్ చెప్పాలని మంత్రి వివేక్ అన్నారు. బీఆర్‌ఎస్ రాజకీయ కుట్రతో కాంగ్రెస్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పేదల పక్షాన నిలబడే వ్యక్తిని కాబట్టే అధిష్టానం తనను ఇంచార్జిగా నియనించిందన్నారు. డివిజన్ అభివృద్ధి చెందలేదంటే పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ను ప్రశ్నించాలని అన్నారు మంత్రి వివేక్. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని… పదేళ్లలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారో చెప్పాలని అన్నారు. షేక్ పేట్ డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయని.. పదేళ్లలో బీఆర్‌ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీ నుండి గతంలో మహమూద్ అలీ మంత్రిగా పని చేసారని.. ఆయన ముస్లిం సమాజానికి ఏం చేయలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అజారుద్దీన్ ని మంత్రి చేస్తోందని.. ఎమ్మెల్సీగా ముస్లిం మైనారిటీ వ్యక్తికి అవకాశం ఇస్తే బీఆర్‌ఎస్ అడ్డుకున్నారని అన్నారు మంత్రి వివేక్. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని.. బీఆర్‌ఎస్ కు ఓటేస్తే.. బీజేపీకి వేసినట్లేనని అన్నారు. ఇంకా మూడేళ్ళ పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. కాంగ్రెస్ వల్లే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని బీఆర్‌ఎస్ గతంలో హా ఇచ్చి మోసం చేసిందని అన్నారు మంత్రి వివేక్. 28 రాష్టాల్లో్ర దొడ్డు బియ్యం ఇస్తున్నారని.. సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



