– హరీష్‌ను చూసి గోబెల్స్ తలదించుకుంటున్నాడు
~ వాళ్లు ఇచ్చిన జీవోతోనే లేఖ రాశాం
~ ఉత్తమ్ చిట్ చాట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29ః ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం అంటూ బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నదని, హరీష్ రావు ను చూసి గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాడని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాలమూరు – రంగారెడ్డిలో 90 టీఎంసీలకు ప్రతిపాదించారని, దాన్నపై తాము ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చిట్‌చాట్ మాట్లాడుతూ 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి డైవర్షన్ అని వాడారు.. వాళ్లు ఇచ్చిన జీవోనే తాము ప్రస్తావిస్తూ లేఖ రాశాం. మొదటగా మా సేవింగ్ ఉన్న 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ ను క్లియర్ చేయమని అడిగాం.పేజ్ -1లో మొదటగా చేయమని అడిగాం. బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టులో 7 టీఎంసీ లకు ఒప్పుకుని వచ్చారు. మీరు పదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. మేము మాత్రం పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి నీరు అందిస్తాం. మీ చేతకానితనాన్ని మాపై రుద్దవద్దు. మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. డీపీఆర్ కేంద్రానికి పంపడానికి ఏడేళ్ళు టైం తీసుకున్నారు. డీపీఆర్ పంపే టైంకు రూ.21 వేల కోట్లు ఖర్చు చేశారు. పాలమూరు – రంగారెడ్డిలో పదేళ్ల కాలంలో రూ.21 వేల కోట్ల పనులు మాత్రమే చేశారు. సీడబ్ల్యూసీ కి డీపీఆర్ పంపే టైంకు రూ.65 వేల కోట్ల అంచనాగా పేర్కొన్నారు. మొదట్లో రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టు ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే టైం కు రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారు. ఆయకట్టు కాల్వ లకు భూసేకరణ చేయాలంటే మొత్తం కలిపి రూ.70 వేల కోట్లు అవుతుంది. 35 శాతం ఖర్చు చేసి 80 శాతం చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటు. తాము రెండేళ్లలో 7 వేల కోట్లు ఖర్చు చేశాం. బీఆర్ెస్ హయాంలో ఒక్కటే పంపు పెడితే తాము వచ్చాక 11 మోటర్లు పెట్టాం. పారూ.లమూరుకు రూ.27 వేల కోట్లు, కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు అని మంత్రి ఉత్తమ్ గణాంకాలతో వివరించారు. మీకు పాలమూరు మీద ఎందుకు అంత వివక్ల అని ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. పాలమూరును రెండు టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి కుదించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచారు. సీఈ విజయ్ భాస్కర్ రెడ్డి కి స్వయంగా పాలమూరు పనులు స్లో చేయాలని చెప్పారు. ఇరిగేషన్ మీద రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశారు. కానీ పాలమూరులోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణా లో 299 టీఎంసీ లకు కట్టుబడి ఉంటామని అపెక్స్ కౌన్సిల్ లో బీఆర్ఎస్ పాలకులు ఒప్పుకున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లపూర్, ఎదుల లింక్ పనులు కూడా ఆపేశారుని, రూ.2 వేల కోట్ల ఖర్చు చేస్తే పూర్తి అయ్యే ఎస్ఎల్‌బీసీ విషయంలో నిర్లక్ష్యం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు మాత్రం మొండి చేయి చూపారని విమర్శించారు. కల్వకుర్తి రూ.900 కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యేదని, కానీ చేయలేదని ఉత్తమ్ ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





