దంప‌తులు గ‌ల్లంతైన ప్రాంతాన్ని ప‌రిశీలించిన పొన్నం

– గాలింపు ముమ్మ‌రం చేయాల‌ని అధికారుల‌కు ఆదేశం

హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: హుస్నాబాద్‌ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె వాగు దాటుతుండగా బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రణయ్‌, కల్పనలు గల్లంతైన ప్రాంతాన్ని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురువారం రాత్రి పరిశీలించారు. ఈ జంట గల్లంతై 24 గంటలు దాటినా ఇంతవరకు దొరకకపోవడంతో సహాయక కార్యక్రమం ముమ్మరం చేసేలా చీఫ్‌ సెర్రటరీ రామకృష్ణారావుతో మంత్రి మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ నిరంతరం అక్కడే ఉండి సెర్చ్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఫైర్‌ ఫైటర్స్‌, గజ ఈతగాళ్లతో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో శుక్రవారం ఉదయం నుండి సెర్చ్‌ ఆపరేషన్‌ ముమ్మరం చేసి గల్లంతైన వారీ ఆచూకీ కనుగొనేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. సంఘటనస్థలంలో ప్రణయ్‌, కల్పనల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతుండటంతో వారిని మంత్రి ఓదార్చారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి ఘటన స్థలం నుండి వారిని ఇంటికి పంపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *