రెవెన్యూ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌న‌

  • ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కే రెవెన్యూ అధికారులు
  • నేటి నుంచి అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు
  • మాన‌వీయ కోణంలో భూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి 
  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి 

హైద‌రాబాద్ప్ర‌జాతంత్ర‌జూన్ 2 : గ‌త ప్రభుత్వం త‌మ స్వార్ధం కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ధను దుర్వినియోగంచేసింద‌ని,  మొత్తం వ్యవ‌స్దను ప్రక్షాళన చేసి భూ ప‌రిపాల‌న‌ను ప్రజ‌ల వ‌ద్దకే తీసుకువెళ్తున్నామ‌ని రెవెన్యూహౌసింగ్‌స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy ) తెలిపారురెవెన్యూ సదస్సులపై సోమవారం  మంత్రి  అధికారులతో సమీక్షించారుఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ ప్రజలు కోరిన విధంగా రాష్ట్రంలో భూ స‌మ‌స్యల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపేలా ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక‌మైన భూభార‌తి చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చామ‌న్నారుమొదటి దశలో 17వ తేదీ నుంచి నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో ప్రయోగాత్మకంగా అమ‌లు చేసి రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వహించాంఆ త‌ర్వాత మే 5వ తేదీ నుంచి 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహించాంతాజాగా జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూ భార‌తి చ‌ట్టంలో భాగంగా మిగిలిన అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వహిస్తున్నామన్నారు  

అన్ని రెవెన్యూ గ్రామాలకు తహశీల్దార్ తో కూడిన బృందం వెళ్తుందిప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుందన్నారుమొదటగా నాలుగు పైల‌ట్ మండ‌లాల్లో 72 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సుల్లో 13 వేలకు పైగా దరఖాస్తులు రెండో విడతలో 28 మండలలో 421 రెవెన్యూ గ్రామాలల్లో నిర్వహించిన సదస్సుల్లో 42 వేల దరఖాస్తులు వచ్చాయివచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేసి ఇప్పటి వరకు 60 శాతం వ‌ర‌కు భూ స‌మ‌స్యలు ప‌రిష్కరించామ‌న్నారుఅధికంగా సాదా బైనామాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయనిఈ అంశం కోర్టు ప‌రిధిలో ఉందనిదీనికి త్వర‌లో ప‌రిష్కారం చూపిస్తామని తెలిపారుప్రభుత్వానికి ప్రజ‌ల‌కు రెవెన్యూ శాఖ వార‌ధిగా ఉంటుందనిఈ విభాగం స‌మ‌ర్ధవంతంగా ప‌నిచేసిన‌ప్పుడే ప్రభుత్వం నిర్ధేశించిన ల‌క్ష్యాలు ఆకాంక్షలు నెర‌వేరి ప్రభుత్వం కోరుకున్న ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారుముఖ్యంగా క‌లెక్టర్లు మాన‌వీయ కోణంలో భూ స‌మ‌స్యలు ప‌రిష్కరించాలనిఎప్పటిక‌ప్పుడు క్షేత్రస్ధాయిలో ప‌ర్యటించి భూ స‌మ‌స్యల ప‌రిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారుఈ రెవెన్యూ స‌ద‌స్సుల్లో భాగంగా ప్రజ‌ల వ‌ద్దకు వెళ్లే రెవెన్యూ యంత్రాంగం మాన‌వ‌తా దృక్పధంతో వ్యవ‌హ‌రించి ప్రజ‌ల‌తో మ‌మేకం కావాలనివీలైనంత‌వ‌ర‌కూ వారి స‌మ‌స్య ప‌రిష్కారం చేసేలా వ్యవ‌హ‌రించాలన్నారు  

భూభార‌తి చ‌ట్టంలో భాగంగా గ్రామ ప‌రిపాల‌న అధికారులకు (జి.పి..) అతి త్వర‌లో నియామక పత్రాలను అందజేసి మండలాల్లో నియ‌మించ‌బోతున్నామని ప్రకటించారుగ్రామ పాలన అధికారుల 10,954 పోస్టుల భర్తీకి జి.విడుదల చేయగా 5వేలకు పైగా దరఖాస్తులు అందాయనిఇందులో మే 25 తేదీన నిర్వహించిన పరీక్షకు 4,588 మండి అభ్యర్థులు హాజరు కాగా తుది మెరిట్ జాబితాలో 3,550 మండి అభ్యర్థులు ఎంపిక అయ్యారని తెలిపారుఅలాగే భూ స‌మ‌స్యల‌కు శాశ్వత ప‌రిష్కారం చూపాల‌న్న ల‌క్ష్యంతో భూముల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో డాక్యుమెంట్లతో పాటు స‌ర్వే మ్యాపు జ‌త‌ప‌ర‌చాల‌ని భూభార‌తి చ‌ట్టంలో పేర్కొన్నామ‌న్నారుఇందుకు అనుగుణంగా స‌ర్వే సెటిల్ మెంట్ విభాగాన్ని బ‌లోపేతం చేస్తున్నాంమొదటి ద‌శ‌లో ఆరు వేల మంది స‌ర్వేయ‌ర్లను రెండు నెల‌ల్లో నియ‌మించ‌బోతున్నాంత‌ర‌త‌రాలుగా న‌క్షా లేని 413 గ్రామాల‌లో పునఃస‌ర్వే నిర్వహించ‌బోతున్నాంఇప్పటికే 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారుఅదేవిధంగా టి‌జి‌ఆర్‌ఏసి (టీజీఆర్ ఏసీ – తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ద్వారా సర్వే రికార్డులను (మ్యాపులుడిజిటలైజేషన్ కు శ్రీకారం చుట్టామ‌నిఇందుకు సంబంధించి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *