– మంత్రి జూపల్లి కృష్ణారావు
– కాంగ్రెస్‌లో కష్టపడే కార్యకర్తలకే పదవులు
– మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి. ప్రజాతంత్ర, డిసెంబర్ 25: పాలమూరుపై మాజీ సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి పట్టణంలో గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్త కాపు శివసేనారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వ హించారు. స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శివసేనరెడ్డికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఇటీవ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు న టికెట్లు పొంది గెలుపొందిన సర్పంచులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనలో ఉమ్మడి పాలమూరు జిల్లా కీలక పాత్ర పోషించిందని, ఒకప్పుడు వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరును గత పదే ళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శిం చారు. పాలమూరుతోనే రాజకీయంగా ఎదిగిన కేసీఆర్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఈ జిల్లాపై కపట ప్రేమ చూపిస్తు న్నారని, పదేళ్ల పాలనలో జిల్లాకు చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పార్టీలో పని చేసిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా గౌరవం, పదవులు దక్కుతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమ యంలోనూ ఓపికగా, నిబద్ధతతో పనిచేసిన వారిని అధిష్టానం గుర్తిస్తుందని చెప్పారు. టికెట్లు లేకపోయినా, పదవులు లేకపోయినా సంవత్సరాలతరబడి పార్టీ కోసం కష్టపడ్డవారికి నేడు ఎమ్మెల్యే, మంత్రిస్థాయికి ఎదిగే అవకాశాలు వస్తున్నాయని, ఇది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కోసం ఎన్ని మెట్లయినా కిందకు దిగుతానని స్పష్టం చేశారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎన్నికల్లో అత్య ధిక స్థానాలు గెలుచుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాప్రయోజన పథకాల కారణంగానే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విస్తృత మద్దతు లభించిందని తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలోనే ప్రాజెక్టులు, కాలువలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, నేడు మళ్లీ ప్రజా పాలన అందుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త- పాత తేడా లేదని, కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకుంటామని, బీఆర్ఎస్ నాయకులు వాటిని భూతద్దంలో చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్త కాపు శివసేన రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను ఆదరించి వారికి తగిన గౌరవం, బాధ్యతలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా, మండలస్థాయి నాయకులు సహా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపు చ్చారు. కార్యక్రమంలో డీసీసీ చైర్మన్, జిల్లా మాజీ అధ్యక్షుడు, పీసీసీ సభ్యులు, జిల్లా నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు. మండల, పట్టణ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఈయూఐ, ఐఎన్ టీయూసీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




