వరంగల్, ప్రజాతంత్ర, జులై 13: కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేతృత్వంలో గాంధీ భవన్‌లో పార్టీ నాయకుల సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివ`ద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై చర్చించి నాయకులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించామని, . ఆయా అంశాలపై జిల్లా నేతల అభిప్రాయాలను తెలుసుకున్నామని చెప్పారు. నేతల మధ్య అభిప్రాయ భేదాలు, క్రమశిక్షణ చర్యలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
వరంగల్ జిల్లా నేతలతో మంత్రులు అడ్లూరి, సీతక్క సమావేశం





