‌మీడియాకు ఎక్కి రచ్చ చేయవద్దు

– మంత్రి సురేఖకు మీనాక్షి హెచ్చరిక

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 16: ‌దేవాదాయ‌, అట‌వీ శాఖ‌ల‌ మంత్రి కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ‌ఫోన్‌లో మాట్లాడారు. మీడియా ముందుకు వెళ్లవద్దని ఆమె సూచించారు. కూర్చొని మాట్లాడదామని చెప్పినట్లు సమాచారం. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంటు కంపెనీల యాజమాన్యాలను బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఆయ‌న‌ను ఆ బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని సురేఖ నివాసంలో సుమంత్‌ ఉన్నారన్న సమాచారంతో మప్టీలో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి కుమార్తె సుస్మిత వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తమపై బురదజల్లేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని ఆరోపించారు. తన తల్లిదండ్రులనే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖతో మీనాక్షి నటరాజన్‌ ‌మాట్లాడినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో సమసిపోయేట్లు చూద్దామని చెప్పినట్లు సమాచారం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *