– హాస్పిటల్ సందర్శించిన ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్
ములుగు, ప్రజాతంత్ర, జనవరి 18: మేడారం టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 50 పడకల హాస్పిటల్‌ను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడు డాక్టర్ రవీంద్రనాయక్ ఆదివారం సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సందర్శన, మేడారంలో మంత్రివర్గ సమావేశంలో భాగంగా రవీంద్ర నాయక్ మాట్లాడారు. ఈనెల 28నుంచి జరుగు జాతరలో భక్తులకు నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో ఒక టీం వర్క్‌గా పనిచేసి భక్తులకు వైద్య సేవలు అందించి జాతరలో వైద్య, ఆరోగ్య శాఖను ముందు వరుసలో ఉంచాలని అధికారులకు సూచించారు.
ఉచిత వైద్యశాలలో 24 గంటలు వైద్య సేవలు
రెండు రోజుల నుండే టీటీడీ కళ్యాణ మండపంలోని ఉచిత వైద్యశాలలో 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నామని, పాము కాటు, తేలుకాటు, కుక్క కాటుకు అత్యవసర మందులను సమకూర్చుకొని వైద్య సేవలందించడానికి వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైందని తెలిపారు. జాతరలో బస్టాండు, జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్, హరిత హోటల్ వంటి ప్రదేశాలలో ఉచిత వైద్య శిబిరాలతో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జాతర సమయంలో 30శిబిరాలతో ఇంకా మెరుగైన వైద్య సేవలందించడానికి ప్రణాళికలను తయారు చేసుకున్నామన్నారు. బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవల పట్ల ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు, సమ్మక్క సారలమ్మ జాతర కో నోడల్ అధికారి, హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ అప్పయ్య, జిల్లా ఉప వైద్య ఆరోగ్యాధికారులు డాక్టర్ విపిన్ కుమార్, డాక్టర్ క్రాంతి కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ భవ్యశ్రీ, డాక్టర్ మోనిక, డీపీఎం సంజీవరావు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ డాక్టర్ తరుణ్, డాక్టర్ విజయ్, డాక్టర్ అన్మిష దుర్గారావు, వెంకట్ రెడ్డి, సురేష్, ఫార్మసీ ఆఫీసర్ స్వామి, సూపర్వైజర్స్ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




