~ గ్రూప్-1 ఆఫీసర్లకు మంత్రి దామోదర ఉద్బోధ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: వైద్య, ఆరోగ్య శాఖలో నియమితులైన గ్రూప్-1 ఆఫీసర్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సెక్రటేరియట్‌లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య శాఖలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, అనారోగ్యంతో ఆపదలో ఉన్మ ఎంతోమందికి సేవ చేసే అవకాశం ఈ శాఖలో ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లకు అత్యంత పేద ప్రజలు వస్తుంటారని, వారిని అప్యాయంగా, ప్రేమగా చూసుకునే బాధ్యత ఈ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరిపై ఉంటుందని అన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా, నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా పనిచేయాలని కొత్త అధికారులకు మంత్రి సూచించారు. ఆధునికత, సాంకేతికను జోడిరచి వైద్య సేవలు మెరుగుపరిచే దిశగా ఆలోచన చేయాలని మంత్రి ఉద్బోధించారు. ఈ సందర్భంగా హాస్పిటళ్ల పనితీరు, ఆరోగ్య రంగంలో టెక్నాలజీ, గ్రామీణ ప్రాంత ప్రజల చెంతకు స్పెషాలిటీ వైద్య సేవలు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అధికారులకు మంత్రి వివరించారు. ఒకప్పటిలా ఇప్పుడు అంటువ్యాధుల సమస్య లేదని, వాటి స్థానంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ ( నాన్ కమ్యునికెేబుల్ డిసీజెస్) సమస్య పెరిగిందని, ఈ పరిస్థితిని అవగాహన చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి జిల్లాలోనూ డే కేర్ కేన్సర్ సెంటర్స్, ఎన్‌సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఎన్‌సీడీ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



